తపనే తీయని తలపవగా
మదిలో ఓ భావన మెదిలెనుగా
తపనే తీయని తలపవగా
మదిలో ఓ భావన మెదిలెనుగా
నింగిన జాబిలి నిను చేసి
పండు వెన్నెలను నే కానా !
వెన్నెల ఒడిలో నిను చేర్చి
తియ్యని కలలను నే కననా !
తపనే తీయని తలపవగా
మదిలో ఓ భావన మెదిలెనుగా
కొమ్మన పూవును నిను చేసి
పూవుకి తావిని నే కానా !
మధువులు చిందే నిను చూసి
మధుపాన్నై నీ దరి రానా !
తపనే తీయని తలపవగా
మదిలో ఓ భావన మెదిలెనుగా
కోయిల గళమును నిను చేసి
కోనల మొలచిన కొమ్మవనా !
తీయని పాటగ నిను కూర్చి
పాడని క్షణమిక లేదననా !
తపనే తీయని తలపవగా
మదిలో ఓ భావన మెదిలెనుగా
నింగిన జాబిలి నిను చేసి
పండు వెన్నెలను నే కానా !
వెన్నెల ఒడిలో నిను చేర్చి
తియ్యని కలలను నే కననా !
తపనే తీయని తలపవగా
మదిలో ఓ భావన మెదిలెనుగా
కొమ్మన పూవును నిను చేసి
పూవుకి తావిని నే కానా !
మధువులు చిందే నిను చూసి
మధుపాన్నై నీ దరి రానా !
తపనే తీయని తలపవగా
మదిలో ఓ భావన మెదిలెనుగా
కోయిల గళమును నిను చేసి
కోనల మొలచిన కొమ్మవనా !
తీయని పాటగ నిను కూర్చి
పాడని క్షణమిక లేదననా !
తపనే తీయని తలపవగా
మదిలో ఓ భావన మెదిలెనుగా